FaithWalk
← Back to Library

#577కృతజ్ఞతార్పణల పండుగ – ఉత్తమ కీర్తన

Author: యెషయా వీరమార్టిన్Composer/Ragam: జంఝూటిCategory: క్రైస్తవ కుటుంబము
ప
పరమ తండ్రి నిన్ను మేము – పరస కాలము – స్వరము లెత్తి యింపుగాను – స్మరణ జేతుము ||పరమ||
1.
నిరుపమాన దేవ నిన్ను – నిరత ప్రేమతో – హరువుగా నుతింతుము మేము – హర్షరవముతో ||పరమ||
2.
అవని సంభ్రమములలోన – నవముద్రలంచుము – అవసరముగా నీదు పలుకు నవధరింతుము ||పరమ||
3.
వేయి నాళ్ళు లోకమునను – వెలయుకంటెను – శ్రేయ మొక్కనాడు నిన్ను – సేవ చేయుట ||పరమ||
4.
ఉచితమైన నీ గృహమున – నచల భక్తితో – రుచిరమైన నీదు ప్రేమ రుచిరెంతుము ||పరమ||
5.
మనసునందు సత్య బోధ – మనసరించుచు – మనెడు తరిని విడువము నీదు – లనికిపట్టును ||పరమ||
6.
గొఱ్ఱెపిల్ల యొక్క ప్రేమ – గూర్చి భక్తితో – గొరత లేక చేతు మెప్పుడు – గొనబు గానము ||పరమ||
7.
శాంతజలము నొద్ద మమ్ము – శాంతి పరుచుము – సంతతమును నీవు మమ్ము – సంతరించుము ||పరమ||
8.
దినము లన్ని మేము నిన్ను – దీన మనసుతో – వనరమాని సంతసమున – వినతి చేతుము ||పరమ||