FaithWalk
← Back to Library

#574క్రైస్తవ దాతృత్వము

Author: బన్యన్ జోసెఫ్Composer/Ragam: నాదనాయమక్రియ (ఛాయ: భజన చేయు విధము దెలియుండడి)Category: క్రైస్తవ కుటుంబము
ప
ఇచ్చునట్టి విధము తెలియండి – ప్రియులారా మీరు – హెచ్చు పొందు విధము ఇది యండి – పుచ్చుకొనుట కన్న నెప్పడు – డిచ్చుటయే కడు ధన్యత యని – హెచ్చరించి చెప్పలేదా – యేసు ప్రభువపోస్తలులకు ||ఇచ్చు||
1.
శక్తికొలది దాన మీయుండి – సోదరులార – భక్తికొలది పరుల కీయుండి – శక్తి లేదని సాకు చెప్పక – సణుగ కేమియు సరగ శ్రద్ధా – శక్తితో పేదలకు నిచ్చుట – యుక్తమని భావించి మదిలో ||ఇచ్చు||
2.
నీతిబోధలు చేయువారికి – బోధకులైన – నిఖిల పాలకులైన వారికి – ఆతురముతో నీయవలెనని – యనుభవముగల మీరలల్లరు – చేతులార నీయుడయ్య – ప్రీతి తోడును వారవార ||ఇచ్చు||
3.
ఆలయ కృత్యములు జరిపించు – యాజకుండెప్పుడు – నాలయమువలన జీవించు – ప్రాలుమాలక పనిని చేయన్ – బరగు మీ యర్పణల కాన్కల – బలవంతము లేక మీరు పలువిధంబుల నియ్య వెదకండి ||ఇచ్చు||