FaithWalk
← Back to Library

#573క్రైస్తవ దాతృత్వము

Author: మోర్త ప్రకాశముComposer/Ragam: శంకరాభరణము (ఛాయ: యేసు నామం బెత్తి పాడుదము)Category: క్రైస్తవ కుటుంబము
ప
దాతృత్వమును కలిగి పెరుగుదము – ధనము – ధాత్రి దేవుని దంచు నెరుగుదము ||దాతృ||
1.
శక్తికొలది కాన్కలర్పింతము – మన – భుక్తినుండి కొంత తీయుదము ||దాతృ||
2.
సంతోషముగా నియ్య సాగుదము – మన – సొంతంతటితో జేయ నేగుదము ||దాతృ||
3.
గర్వఘనములు వీడి యర్పింతము – యుర్వి – సర్వ మాయనదంచు నేర్పింతము ||దాతృ||
4.
సంఘ సేవకు సొమ్ము సమకూర్తము – క్రీస్తు – సంఘ యెక్కరలన్ని తీర్చుదము ||దాతృ||
5.
ప్రతి యాదివార మిది మది నుంతము – దీని ప్రతి సంఘస్థుడు చేయ బోధింతము ||దాతృ||
6.
విధిని దలచి దుర్భలుల రక్షింతము – సంఘ – విధవాళి దానముతో దర్శింతము ||దాతృ||
7.
దిక్కులేని జనుల దీవింతము – వారి – యెక్కరలలో మేలు గావింతము ||దాతృ||
8.
పుచ్చుకొనుటకంటె నిచ్చుదము – మరల – నిచ్చు తండ్రికి స్తుతుల నిచ్చెదము ||దాతృ||
9.
వెదజల్లి యభివృద్ధి పొందుదము – మోక్ష – పదవులను భుజింప బరుగిడుదము ||దాతృ||
10.
వర్ధిల్లిన కొలది చెల్లింతము – లోక – వ్యర్థ ఖర్చులనెల్ల మళ్ళింతము ||దాతృ||