#57Saviour, again to Thy dear Name we raise
Author: జాన్ ఎల్లర్టన్ (అనువాదం: బర్నార్డ్ లూకాస్)Translator: బర్నార్డ్ లూకాస్)Category: సాయంతనారాధన
1.
ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యముతోను నుతియింతుము
ఆరాధనాంతమొందు వేళయందు అనుగ్రహించు నీదు దీవెన.
2.
గృహంబు చేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా
ఇచ్చట సేవ చేయు మమ్మును పాపంబు చేయకుండ గాయుము.
3.
మా చుట్టు నుండు మబ్బున ప్రభు నీ దివ్య కాంతిని మాకు నియ్యుమా
పాపాంధకార బాధ నుండి నీ బిడ్డలమైన మమ్మును బ్రోవుమా.