FaithWalk
← Back to Library

#56Abide with me, fast falls the eventide

Author: హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ (అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Translator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Category: సాయంతనారాధన
1.
రాత్రియయ్యెను నన్నెన్నడు బాయకు ధాత్రిపై చీకటులు గ్రమ్మెను సహాయమేమియు లేనివారికి సహాయుడా, నన్ను బాసిపోకుమీ.
2.
ఏ కాలంబైన నీ సహాయము లేక పిశాచిని గెల్వజాలను లోక ప్రకాశుడా, నన్ను నడిపించుము.
3.
నా చెంత నీవు చేరియుండగా ఏ చింతయైన నన్ను సోకునా ఏ శత్రువైన నన్ను గెల్చునా? నా శైలమా, నన్ను బాసిపోకుమా.
4.
సమృద్ధుడవు సహాయుడాయెను చావు జీవంబులందునైనను మా మధ్యమున సర్వేశా పాయకుము.
5.
రేవు నేను చేరబోవు వేళలో ఓ మృత్యువా నీ ముల్లు గెల్చునా? సమాధి నీకు జయమబ్బునా? నీవు తోడై నన్ను బాసిపోకుము.