#547యేసును అనుకరించుట
Author: పి. విజయ చార్లెస్Composer/Ragam: శంకరాభరణము (ఛాయ: దేవుడే నా కాశ్రయంబు)Category: క్రైస్తవ కుటుంబము
1.
యేసు బోలి మంచిబుద్ధి – యెంతో ప్రేమకలిగినే – నేసు గోరినట్టి పనుల – నెప్పుడు చేయగోరుదున్ – దయయు శాంతమమరినట్టి – తనదు నడత దలచుకొనుచు ||యేసు||
2.
యేసు చిన్నబాలుడై – ధరణి తిరిగినప్పుడు – ఎల్లరితని మంచి గుణము – లెంచి ప్రేమ చూపారు – దయయు, శాంతమమరినట్టి – తనదు నడత దలచుకొనుచు ||యేసు||
3.
పిట్టలందు – పూవులందు – ప్రీతి చూపిన యేసుడు – అల్పజీవులైన, తండ్రి – యన్ని చేసెనంచును – దయయు, శాంతమమరినట్టి – తనదు నడత దలచుకొనుచు ||యేసు||