#546చిన్న పిల్లలను నిషేధింపవద్దు
Author: తూపిలి యోహానుComposer/Ragam: సురటి (ఛాయ: ఆనందమగు ముక్తి)Category: క్రైస్తవ కుటుంబము
ప
ఆ చిన్న వారిలో నేనుండి యున్న – నహహా మా యేసును – నేను చూచి యుందు ||నా చిన్న||
1.
ప్రభు యేసు ప్రపంచమందుండినప్పుడు – పసి బాలకుల బిలిచి ప్రార్థించె ననాడు – ప్రాచీన కథను నేను చదువుచున్నప్పుడు – వారిలో నేనున్న – నెంతో బాగుండు ||నా చిన్న||
2.
ఆ కరుణ కరము నా తలపై వ్రాలి – యాకాశ బాహువు నా చుట్టు నిలిచి య – నేక బాలకుల రానిమ్మను జాలి – తో గర్త పిలుపు విన – నాకెంతో మేల్మి ||యా చిన్న||
3.
ఇక మీద ప్రార్థన ద్వారా దర్శింతున్ – బ్రకటిత ప్రభు ప్రేమ పంచి యియ్యమందు న – మ్మకముతో యేసుని వెదకుచు నుందు – సుఖ లోకమందున – చూచి వినుచుందు ||నా చిన్న||
4.
శుద్ధుల కొరకు రాజ్యము నేలన్ – సిద్ధము చేయన్ ప్రభు యేసు వెళ్ళెన్ – ముద్దు పాపలు వత్తు రందున వినుమ – శ్రద్ధ సేయకు వారి దాకాశ రాజ్య ||మా చిన్న||