#54Sun of my soul, Thou Saviour dear
Author: జాన్ కెబిల్ (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Translator: జేకబ్ చేంబర్లేన్)Category: సాయంతనారాధన
1.
నా యేసు, ఆత్మ సూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు
నా యాత్మలో నీవిప్పుడు నివసించి పాయకుండుమీ.
2.
నేను నిద్రించు వేళలో నాకున భయముయుము
నే లేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షకా.
3.
నాతోడ రాత్రింబగళ్లు నీ వుండి నడిపించుము
నీవు నాతో లేకుండిన జీవింప జాలజాలను.
4.
నేడు నీ దివ్య వాక్యము వినిన పాపులెల్లరిన్
క్షమించి గుణపరచి నీ మందలోన చేర్చుము.
5.
రోగిని స్వస్థపరచి బీదలను పోషించుమీ
దుఃఖించు వారి దుఃఖముం బాపి యానంద మీయుము.