#53సాయంతన ప్రార్థన
Author: మల్లెల దావీదుCategory: సాయంతనారాధన
ప
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము
నీ సుదయా రసము – నిత్యంబు మమ్ముగావుము || మా ||
1.
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో
బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రి || ఈ ||
2.
దుష్టుండు శోధకుని – ద్రొక్కుటకు బలమిమ్ము
భ్రష్టత్వమున మేము – పడకుండగ కాపాడుము || మా ||
3.
నీ యేక పుత్రుండు – శ్రీ యేసు నామమున
సాయంత ప్రార్థనలెల్ల – సరగ నాలించుమా || ఈ ||
4.
జనక సుత శుద్ధాత్మ – ఘనదేవా నుతియింతుము
అనిశము జీవించి – జయంబు చేయుమా ఆమెన్ || ఈ ||