FaithWalk
← Back to Library

#536బాల ప్రార్థన

Author: జి. పెద్ద సమూయేలుComposer/Ragam: జంఝూటిCategory: క్రైస్తవ కుటుంబము
ప
రాజా నా దేవా – నన్ను గావ రావే – ప్రభు ||రాజా||
1.
తల్లి గర్భంబు బయలు – వెళ్ళిన దినమునుండి – కొల్లగా సేవింప – జల్లనైన మోక్ష మియ్య ||రాజా||
2.
బాలప్రాయమునుండి – బ్రతికిన కాలమంత – నీలాగు జీవించి – నిత్యమైన మోక్షమొంద ||రాజా||
3.
మాకొరకై వచ్చి – మా పాపములకు మాయ – లోకములోన మృతికి – లోనై లేచితివయ్య ||రాజా||
4.
దండి ప్రభుండు యే – సండ జేరగా మాకు – నిండు వేడుకతోను – నిత్య మోక్షంబు నియ్య ||రాజా||