FaithWalk
← Back to Library

#537యేసునాథా, రమ్ము

Author: ఫిలిప్ బెంజమిన్Composer/Ragam: శహానCategory: క్రైస్తవ కుటుంబము
ప
యేసునాథా రారారా – మా – జీవనాథా రారారా ||యేసు||
1.
దోషములు బాప నీవు – వాసిగ జన్మించినావు ||యేసు||
2.
నీచులను ప్రేమించి – నీ కరుణను చూపినావు ||యేసు||
3.
నీతిలేనివారి కెల్ల – నిత్య జీవ మిచ్చినావు ||యేసు||
4.
పొందరాని కష్టములను – పొంది యుంటివి తండ్రి ||యేసు||
5.
లోకపాపమును జయించి – లోకుల రక్షించితివి ||యేసు||
6.
వేడుకతోడ మేము – వేడుకొందుమో తండ్రి ||యేసు||