←అన్ని కీర్తనలు · All SongsHymn #535 of 763
Font size:
535
బాలకుల విన్నపము
Baalakula Vinnapamu
బాలల విన్నపము
కురంజి (ఛాయ: పరమ తండ్రి నిన్ను) · ఆది
Kuranji (Chaya: Parama Tandri Ninnu) · Aadi
పల్లవి
బాలకుల విన్నపము లాలించు రక్షకా – పాలనంబు చేయుమా పరమ పోషకా ||బాలకుల||
చరణం 1
బాలలారా రండంచు – బిలిచిన యేసూ – చాలనమ్మి చేరితిమి – సరగ బ్రోవుమా ||బాలకుల||
చరణం 2
మందబుద్ధి చేత నిన్ను – మరచియుంటిమి – సుందరాంగ నీ దయ మా – యందు చూపుమా ||బాలకుల||
చరణం 3
చదువు వేదవాక్య సరణి – నడువ నేర్పుమీ – మదిని బోధకుల సుబోధ – మరువనీకుమీ ||బాలకుల||
చరణం 4
ప్రకటితమగు నీదు ప్రేమ – యనుభవించుచు – ఇకను నిన్ను సేవ జేతు – మఖిలకాలము ||బాలకుల||
చరణం 5
పుడమి నీదు సిలువ కృపను – పుణ్యులగుచును – కడను నీదు మహిమ జేర – కరుణ చూపుము ||బాలకుల||