FaithWalk
← Back to Library

#534యేసు నామమునకు జయము

Author: ఎవలైన్ ప్రీస్ట్లీCategory: క్రైస్తవ కుటుంబము
ప
జయం జయం హల్లెలూయ – జయం జయమిప్పుడే – ప్రభు యేసు నామమునకు – జయం జయమిప్పుడే ||జయం||
1.
ఓహో మిత్రులారా మీరు – జ్ఞానమును పొందుడి – స్నేహమార్గం ముక్తిమార్గం – జీవమార్గమాయనే ||జయం||
2.
ఆలస్యమేలనో పాపి – రమ్ము యేసు నొద్దకు – ఆత్మమూర్తి రక్షణమూర్తి – యేసు ప్రభువాయనే ||జయం||
3.
రేపు అను చింతలను – బాపి యేసు నమ్ముడి – రూపుమాపు అనక యేసు – దాపు జేరుడిప్పుడే ||జయం||