←అన్ని కీర్తనలు · All SongsHymn #522 of 763
Font size:
522
మేలుకొని ఇక లే యేసుని
Maelukoni Ika Lae Yaesuni
మేలుకొలుపు
భూపాలము · ఆట · చెట్టి భానుమూర్తి
Bhoopaalamu · Aata · Chetti Bhanumurthy
పల్లవి
మేలుకొని ఇక లే యేసుని – మేలులన్ నోరార పాడరే బాలబాలికలారా చాలా పాడరే – వేలపాడరే ||మేలు||
చరణం 1
పక్షిగణములు కూడి దేవుని – ప్రేమ నేలను పొగడుచున్నవి – బాపహరుడగు క్రీస్తు చెంతకు – పారుమా – రక్షణ కోరుమా ||మేలు||
చరణం 2
అరుణరాగము వెల్లి విరిసెను – ఆకాశంబున – అచ్చలన్గెను – తరుణముననే లే దేవుని కేగెమా – దీవెన కలుగుమా ||మేలు||
చరణం 3
తెల్లవారెను లోకమెల్లను – తెలివిగొని మునుముందు దేవుని – తల్లి దండ్రియు – గురుడు నీవని తలచుచూ – తగ ధ్యానించుమా ||మేలు||
చరణం 4
జగములెల్లను జంతుజాలము – ల గణితంబగు జీవులెల్లను – సొగసున నోరార బొగడుట చూడుమా – నీవును పాడుమా ||మేలు||
చరణం 5
నీతి భాస్కరుడుదయమాయెను – నూతనజీవన మొసంగను – సతతమతని దాపున నివసింప జూడుమా – తగ జీవించుమా ||మేలు||