FaithWalk
← Back to Library

#521ఉత్సవ గానము

Author: ఎ. సి. కిన్సింగర్– పి. డి. శుభామణిComposer/Ragam: యమునా కల్యాణిCategory: క్రైస్తవ కుటుంబము
ప
యేసుతో సాగి గాను పోదము! అడుగడుగున వచ్చు వైరి గెల్వను – యుద్ధనాదంబముతో బోదము ||యేసుతో||
1.
రారాజు సైన్యమందు చేరెను – ఆ రాజు దివ్య సేవచేయను – యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా – యేసుతో సాగి గాను వెడలెను ||యేసుతో||
2.
విశ్వాస కవచమును ధరించుచు – ఆ రాజు నాజ్ఞ మదిని నిల్పుకొనుచు – అనుదినంబు శక్తిని బొందుచున్నవారమై – యేసుతో సాగి గాను వెడలెను ||యేసుతో||
3.
శోధనలు మనల చుట్టివచ్చినా – సాతాను అంబులెన్ని తగిలినా – భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము – యేసుతో సాగి గాను వెడలెను ||యేసుతో||
4.
ఓ యువతి యువకులారా చేరుడి – శ్రీ యేసురాజు వార్త చాటుడి – లోకమంత ఏకమై యేసునాథు గొల్వను – సాధనంబెవరు నీవు నేనెగా ||యేసుతో||