FaithWalk
← Back to Library

#523యువజనులు క్రీస్తునందు సంతోషించుట

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: సారంగ (ఛాయ: పుట్టె నేసుడు నేడు)Category: క్రైస్తవ కుటుంబము
ప
దేవాది దేవాత్మజా – మమ్ము – దీవించు ప్రభురాజా దేవాదిదైవమానుషీభావ్య – దేదీప్య గుణతేజా ||దేవాది||
1.
చెదరిన నీ గొఱ్ఱెల – కదుపు – వెదకవచ్చితివియ్యల – సదయా హృదయాభ్యుదయా సాధు – జన నిత్య పరిపాలా ||దేవాది||
2.
దురితాలవాలమున బుట్టి – నరకగృహముల మునగగా – కరుణారసమునిశము మాపై – విరజల్లవే చల్లగా ||దేవాది||
3.
నరకంబు నిధియొడ్డున – మేము – తిరుగుచు పడబోయిన – తరిని వెనుదిరిగి త్వరగా మమ్ము – మరలించి నావు నన్ను ||దేవాది||
4.
యేసు నీ దాసులము – నీకు – దోసిలి యొగ్గినాము – దోషా రోషా భావ్యములను – దూరముగ దొలగించుము ||దేవాది||
5.
ప్రాణేశ నీ సిలువ – జిందు – శోణితంబు విలువరాని – త్రాణకరము స్థిరము దాని – దర్శించుటే జీవము ||దేవాది||
6.
బాలుర మజ్ఞానము – మమ్ము పాలింపవే నిత్యము – నీ లోపలి జాలి మాకు – నిజముగా చూపుము ||దేవాది||
7.
ఆనందమగు నీ కృప – మేము – ధ్యానించుటకు నేర్పుమా – జ్ఞానోజ్వల బలము శిశువుల – మేనమా కిపుడు ఇమ్ము ||దేవాది||