FaithWalk
← Back to Library

#511మోక్షాపేక్ష

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: జంఝూటి (ఛాయ: ధరణిలోని ధనములెల్ల)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఏదియది ఏదియది – ఏదిరా మన దేశము పాదుకొన్న లౌకికునకు – బహుళ దుఃఖ పాశము ||ఏదియది||
1.
సిలోమను కొలను గల – జీవన ప్రదేశము పాలు తేనె లొల్కునట్టి – పరమ కానాన్ దేశము ||ఏదియది||
2.
ఆయతమై యున్నదది – యమర జనుల కోసము సీయోనను పేరుగల – శ్రీకరుని నివాసము ||ఏదియది||
3.
జీవ ప్రవాహములు గల – జీవుల స్వదేశము కేవల పరిశుద్ధమైన కె – రూబుల స్వదేశము ||ఏదియది||
4.
యేసు జన స్వాస్థ్యమిదే – ఇశ్రాయేలు దేశము మేసయ్యయను రాజు సదా – మృతములిడు దేశము ||ఏదియది||
5.
కోరికలు తీరునట్లు – గొబ్బుననే పోదురా చేరి సౌఖ్యమొంద మదినే – స్థిరత భూని యుంటిరా ||ఏదియది||
6.
మరణమును యోర్దాన్ నది – మధ్యమందు గంటిరా తరుణమునే గాచి దాని – దాటిపోవ నుంటిరా ||ఏదియది||
7.
కాలు ధరణి నిల్వదది – కండ్లు పడు దాకరా మేలుకొని యుంటిరా – మేర దాట లేకరా ||ఏదియది||