FaithWalk
← Back to Library

#512మోక్ష రాజ్యము

Author: ఈ.డి. నిత్యానందముCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
స్వతంత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ రాజ్యం మన రాజ్యం – సమాధానముగల రాజ్యం ||స్వతంత్ర||
1.
ఆద్యంతము లేనిది యీ రాజ్యం – అక్షయ విమల సదా సుఖరాజ్యం చోద్యము వచింప సుందర రాజ్యం – సురుచిర నీతియు గల రాజ్యం ||స్వతంత్ర||
2.
మన దేవుని సహవాసము కలుగున్ – మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్ యేనలేని కాంతియై ప్రభు వెలుగున్ – కనులేమి ఇక చీకటి తొలుగున్ ||స్వతంత్ర||
3.
సూర్చు నెండవడ గాలియు నైనన్ – సోకదు తన ప్రజలకు నింతైనన్ ఆర్యసహాయం బాకలియైనన్ – అటనుండవు దాహము లైనన్ ||స్వతంత్ర||
4.
నీతిమంతులట నూతన గీతం – ప్రీతిగ పాడుచు ప్రభు సమేతం దూతల బోలి వసింతురు నిరతం – జ్యోతులవలె వెలుగుదురు సతం ||స్వతంత్ర||
5.
జీవ వృక్ష ఫలముల దినపించున్ – జీవ జలంబుల మరి ద్రావించున్ దేవుడె మన కన్నీటిని తుడుచున్ – దేవతలందరి పేరుంచున్ ||స్వతంత్ర||