#5దైవ స్తుతి
Author: పసుపులేటి దావీదుComposer/Ragam: నవరోజుCategory: దైవారాధన — దైవస్తుతి
ప
నీతిగల యెహోవా స్తుతి మీ
యాత్మతో నర్పించుడి మీ యాత్మతో నర్పించుడి
దాతయౌ మన క్రీస్తు నీతిని
దాల్చుకొని సేవించుడి ॥నీతి॥
1.
చదల బుడమియు రవియు జలధియు
నదులు గిరులును చక్కగా
సదమలంబగు దైవ నామము
సర్వదా నుతిచేయను ॥నీతి॥
2.
సర్వశక్తుని కార్యముల కీ
సర్వరాష్ట్రములు అన్నియు
గర్వములు విడి తలలు వంచుచు
నుర్విలో నుతిచేయను ॥నీతి॥
3.
గీత తాండవ వాద్యములతో
శ్రుతి పరచెడు సేవతో
పాతకంబులు బాపదగినవాడా,
ఎంతమాత్రము పాపము లేనివాడా,
పాపులను పవిత్రపరచువాడను పేరు కలవాడా,
దానసమూహమను సముద్రమునకు చంద్రుని వంటివాడా.
ఇలను భక్తులు గూడి కొనియాడ
బలము గలిగిన దేవుని వెలియ స్తుతి
వే నోళ్లతోడను విసుగు జెందక చేయుడి ॥నీతి॥
4.
ఆత్మ నీవిక మేలుకొని శుద్ధాత్మ
యేసుని తండ్రిని త్రిత్వమగు
నా యేక దేవుని హర్షమున సేవింపవే ॥నీతి॥