FaithWalk
← Back to Library

#4దేవుని యనునతత్త్వములు

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: కేదారగౌళCategory: దైవారాధన — దైవస్తుతి
ప
దేవా దివ్యానంత ప్రభావ మాంపాహి ఘన యెహోవా స్థావర జంగమ సహిత నిఖిల జగదావన పావన భావ నిరంతర ॥దేవా॥
1.
నిరంతరము కలవాడా, సారమైన కరుణకు సముద్రుడా. తరగని భాగ్యమును ఆనందమును గలవాడా. शत्रुమిత్ర భావములు లేనివాడు, విరుద్ధ గుణములు లేనివాడు. సుందర ఆశ్చర్య గుణ బృందా బంధుర నిత్యానందా సాధు సజ్జన వంద్యా ఖండిత కలుష బృందా మందమతినైన నా డెందము కడు దెలి వొందజేసి నీ యందు నిలుపగదే ॥దేవా॥
2.
నీవు నన్ను సృష్టించి నావు నా గురురా దేవుడవు క్రీస్తు యేసుని చావు వలన నన్నెన్ని నావు పావన జనక సుతాత్మలతోడను కేవల మొక్కెద వైవెలిగెడి ప్రభు ॥దేవా॥
3.
ప్రేమ స్వరూప నిత్య క్షేమ పతిత పావన నామ దాస లోకాబ్ధి సోమ సర్వేశ పరమ ధామ నేను మెరుగని నీచుడ నధముడ నా మహాత్మ దయతో మన్నింపవే ॥దేవా॥