FaithWalk
← Back to Library

#498యేసు హస్తములలో భద్రము

Author: ఫ్రాన్సెస్ జేన్ వాన్ అల్ స్టైన్ (అనువాదం: పి. షూల్టే)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Safe in the arms of JesusTranslator: పి. షూల్టే)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు అందె పరుండుదున్ కీర్తన వింటివా? నా మనమందునుండి పొందు సుఖం బహా! యేసుని చేతులందు యేసుని రొమ్మునన్ నాకు నభయమందు అందే పరుండుదున్ ॥
1.
యేసుని చేతులందు మిక్కిలి క్షేమము జేరెద నింక నాకు ఏ దుఃఖ బాధలైన నచ్చోట జేరవు పాపపు భీతి బాధ లంటవు నన్నచటన్ కన్నీరు సందియంబుల్ కొన్ని దినాలటన్ ॥
2.
యేసే నా యాశ్రయంబు నాకై చావొందెగా గొల్గొతా యందున నుండి నా గురి సర్వదా చీకటి దాటుదాక నోర్పుతో నుండెదన్ జేరెద నుండెదన్ మంచును నమ్మెదన్ ॥