FaithWalk
← Back to Library

#497ప్రభు బూర మ్రోగునప్పుడు

Author: UnknownComposer/Ragam: ఇంగ్లీష్ మూలం: When the trumpet of the Lord shall soundCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
అంత్య దినమందు దూత బూర నూదుచుండగా నిత్యవాసరము తెల్లవారగా రక్షణందుకొన్నవారి పేళ్లు పిలుచుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్ ॥
1.
నేను కూడ చేరియుందును నేను కూడ చేరియుందును నేను కూడ చేరియుందును నేను కూడ చేరియుందు నచ్చటన్ ॥
2.
క్రీస్తునందు మృతులైనవారు లేచి క్రీస్తుతో పాలుపొందునట్టి యుదయ ంబునన్ భక్తులార కూడిరండు అంచు బిలుచుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్ ॥
3.
కాన యేసు సేవ ప్రత్యహంబు చేయుచుండెదన్ క్రీస్తు నద్భుతంపు ప్రేమ చాటుదున్ కృప నొందువారి పేళ్లు యేసు పిలుచుచుండగా నేను కూడ చేరియుందు నచ్చటన్ ॥