FaithWalk
← Back to Library

#496పునరుత్థాన దినము

Author: మేడికాయల సాధువుComposer/Ragam: పంతువరాళిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
లేచు దినము వచ్చును – మృతులెల్ల నికను – లేచు దినము వచ్చును – వేచి యిలనున్నట్టి – విమలులెల్ల నడుపు – లేచి ప్రభుని నెదురు – కొందు రానందముతో ॥ లేచు ॥
1.
యేసు మేఘారూఢుడై – యిలకు దిగ – వాసిగ దూత లప్పుడు – భాసురంబుగా బాక – పై నినాదము చేయ – గా సమాధుల నిద్రగాంచు జనులెల్ల రు ॥ లేచు ॥
2.
కడబూర ధ్వని చేయంగ – మడిసినవారు – తడవు చేయక లేతురు – ఎడతెగక ప్రభు నొద్దన్ – గడు సంతోసంబుతో – విడువక యుందురురా – విమల లోకమునందు ॥ లేచు ॥
3.
ఘన మహిమతో ప్రభువు రాగన్ – గడలి యప్పుడు – తన యందుండెడి శవములను – ఘనముగాను గాననము – ధన యందుండెడు మృతులను వినయంబుతో దె చ్చి – విభుని కప్పగింప ॥ లేచు ॥
4.
అరయంగ నీతిపరులా – నందమున నక్షర దేహులై వెలయుచు – స్థిరతరానందము – పరలోకమున నెప్పుడు – సుపరిత జీవనము లగుచు – పరమ సుఖ మొందుదురు ॥ లేచు ॥
5.
కరుణలేని సమాధి – నిరతము నన్ను – జేరపట్టియుంచగలదా – వరదు డుండు క్రీస్తుండు – వరదాత సేనలతో – భరింపజేసి నిన్ను – డై యదిగో – నరుదెంచుచున్నాడు ॥ లేచు ॥
6.
మరణమా నీ ముల్లెది – నరులను నింక – వెరపించుచుండగలదా – మరణ సంహారుండు – మహిమతో నరుదెంచెన్ – మరణం బడుగబడును – మర్త్యత్వంబు నిక నుండును ॥ లేచు ॥
7.
మరణంబు నొందలేదా – ప్రభు యేసు నీ – చెరయందుండలేదా – పరమేశు తనయుండు – మరణ సమాధులను – పరిపూర్ణముగా గెల్చి – చెరను జెరగపట్టెను ॥ లేచు ॥
8.
మంగళములు పాడరే – క్రీస్తుకు జయ – మంగళములు పాడరే – మంగళములు పాడి – మంగళ ప్రదుడైన – శృంగార రాజునకు – సంగీతంబులతోడ మంగళములు పాడరే ॥ లేచు ॥