#495విశ్వాసి పునరుత్థానము
Author: తూటూరి కొర్నేలియస్Composer/Ragam: యదుకులకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
మరణమునకు విజయమేది – మరణ
మోడిపోయెరా – మరణమొంది యేసు ప్రభువు – మరల బ్రతికి లే
చెరా ॥ మరణము ॥
1.
క్షయమునందు విత్తబడియె – నక్షయమునందు లేచురా – ప్రియుడు క్రీస్తున
ందు మృతులు – పెంపు పొసంగు ధన్యులు ॥ మరణము ॥
2.
లౌకిక దేహము విడి పర – లోక దేహి యగునురా – భీకర యొర్దాను యేసు ప్రేమతో
దాటించురా ॥ మరణము ॥
3.
ధరణి దుఃఖ బాధలన్ని – ధరణియందే విడుతుము – పరమ దేవుని యొడ్డున ఉండునట్టి
– పరదైసునకు బోదము ॥ మరణము ॥
4.
గగన వీధినుండి యేసు – గ్రక్కున వేంచేయురా – జగతి సర్వ మృతుల నొక్క –
క్షణములోనే బ్రతికించురా ॥ మరణము ॥
5.
బూరరావ మాలకించి – భూమి యెల్ల వణకురా – వారిధిలో మృతులు
జీవ – ధారులై లేచెదరురా ॥ మరణము ॥
6.
భక్తులు విశ్వాసమునకు – ఫలము నొంద బోదురు – మూర్తి కిరీటము ధరించి –
రక్తితో జీవింతురు ॥ మరణము ॥
7.
కరుణలేని మరణమునకు – వెరవకుండ నుండుడి – మరణ విజయుడైన
ప్రభుని – చరణములు నుతించుడి ॥ మరణము ॥