#494భూస్థాపనము
Author: పుлиపాక జగన్నాథముComposer/Ragam: అసావేరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
నిద్రపోయినట్టి – నీ పాద సేవకుని – సదయుడగు తండ్రి – చక్కగా
దాచు – సద్విమలం బగు లోకమున నీ – సదనమందున జేర్చి శుద్ధుల – వదల కెప్పుడు
వారిటో నీ – పద యుగంబుల సేవ కోరుచు ॥ నిద్రపోయిన ॥
1.
ఇతడు లోకమందు – నీ వొసంగిన పని – హితమతి నొనరింఛె – యేసుని కృ
పను – సతతమును బాపముతోడను – జాల యుద్ధమొనరిచ్చి బ్రతికెను –
నతి ముదంబున నీకు నిరతము – నుతులు నెరపెడి నాశన బూనుచు ॥ నిద్రపోయిన ॥
2.
సన్నిధిని జేరిన – సకల వర భక్తుల – కన్నీరు తుడుతువు – కరుణ మీరంగ – నిన్ను
నమ్మినవారి నడువడి – నీవు దేటగా నెరింగి వారికి – జెన్నుగను
దీర్చెదవు న్యాయము – సన్నుతింపగ సజ్జనావన ॥ నిద్రపోయిన ॥
3.
మరణ కాలంబున – ధరణిలో గ్రీస్తుని సిలువ – స్థిరముగా నిలిచిన –
నరులందరూ – వరదుడగు రక్షకుని దయచే – స్థిర పురము నిక్కముగా జేరుచు –
గరువము నేరుతురు ప్రేమ నచ్చట – ధర తరంబులు గడుచుచుండగా ॥ నిద్రపోయిన ॥
4.
పరిశుద్ధుడగు దేవ – పాద సన్నిధిలోన – పరిపూర్ణానందము – పాదు
కొని యుండు – నరక బలములు చెరుప నేరవు – పరమ జనకుని సుతులు
నెమ్మది – స్థిర దయాళుడు కాచువారల – నిరతమును ధన యాత్మ బలమున ॥ నిద్రపోయిన ॥
5.
యేసునాథుని నమ్మి – యిలను విడిచినవారు – భాసిల్ల లేతురు – ప్రభు శక్తి నిలను – భాసు
రంబగు దేహములు తన – దాసులందరికీ ఇచ్చి మోక్ష ని – వాసులుగా జేసి వారల – యాశ తీర్చును మాట
దప్పక ॥ నిద్రపోయిన ॥