FaithWalk
← Back to Library

#493క్రైస్తవుని మరణము

Author: బర్నార్డ్ లూకాస్Composer/Ragam: అఠాణCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
జీవము పోవగనే – దేవుని సన్నిధి – జీవుడు జేరును ॥ జీవము ॥
1.
పుష్పము రాలగనే – బాష్పము లేకనే – బుష్పము వాడిన – బుష్కల ఫలమగును ॥ జీవము ॥
2.
నిధనమొందగా – నిద్దుర పోవుటే – రోదనముండదు – బాధ ముగించెను ॥ జీవము ॥
3.
నష్టము భావమై కష్టము దీరును – ఇష్టముతో ప్రభు – ఇంటను జేర్చును ॥ జీవము ॥
4.
పరమున జొరగనే – హర్షము నొందగనే – మరణము గెల్చిన – సర్వదా జీవించును ॥ జీవము ॥
5.
యేసుడు లేచెను – దాసుడు లేచును – భాసుర గృహమున – వాసము చేయును ॥ జీవము ॥