FaithWalk
← Back to Library

#492పరలోక నిరీక్షణ

Author: బాల జాన్Composer/Ragam: కమాసుCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
వేచియుంటిమి నీ తట్టు – యేసు మేము – వేచి యుంటిమి నీ తట్టు – భాసురంబుగ మహిమను – భాసిల్లు రాకకై – నాశతో కరములు – చాచుచు నీవైపు ॥ వేచి ॥
1.
కూడుచుంటిమి యిచ్చట – వేడెదము గల – కూటములలో – కూర్మితో – గోడు లేని పరమ – కూటములలో భక్తి – కోటులతో గూడి – పాడుచు నిన్ను – స్తుతియింప ॥ వేచి ॥
2.
నమ్మియుంటిమి నీ యొక్క – నమ్మకమైన – నయంపు వాగ్దానములను – ఇమ్ముగా వినకేగి – నెమ్మది నెలవులు గట్టి – మమ్ములను దోడ్కొని పోవను – నమ్మబలికిన మీకై ॥ వేచి ॥
3.
వెరచుచుంటిమి యిచ్చట – తరుచుగ గలిగె – కరుకైన స్థితిగతులలోన – కరువు వేదన విధి – మరణ దుఃఖము లేని – పరమ పురమున జేరి – మురియుటెప్పుడో యనుచు ॥ వేచి ॥
4.
నిత్యంబు విలసిల్లెడి – నిశ్చలమైన – శృంగార స్వర్గంబున – ముత్యాల ద్వారమున – విచ్చితా పోవుచు – బంగారు వీధులలో – సంచరించుట యెప్పుడు ॥ వేచి ॥