#491పరమ భాగ్యము కొరకు ఎదురుచూచుట
Author: ప్రబలు పదవి జేరుటెన్నటికో ॥ యేసును ॥Composer/Ragam: శ్రీరాగముCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసును చూచుట యెన్నటికో పర – వాసుడ నగుట యెన్నటికో –
భాసురముగా నా – పరమ జనకు సిం – హాసనమున
దూ – తాదుల మధ్యను ॥ యేసును ॥
1.
బలితంబగు పైశాచిక బంధన – పాశము వదలుట యెన్నటికో – సలి
లముగా నా – సద్గురు పాద – స్థలమున కరుగుట యెన్నటికో ॥ యేసును ॥
2.
ధాత్రి కష్ట దుఃఖాంబుధి మన మింక – దాటిగా దాటుట యెన్నటికో –
మైత్రితోడి పరమాత్ముని చెంతను – మనసు తీర – మనుటెన్నటికో ॥ యేసును ॥
3.
కాంచన మకుటము కనకపు వీణెయు – ఘనముగా దాల్చుట యెన్నటికో
– అంచితముగా హల్లెలూయా పాటల – నానందించుట
యెన్నటికో ॥ యేసును ॥
4.
శోధన బాధల హీన ధరన్ బొందక – శోకము గెల్చుట యెన్నటికో – సాధూత్తమ
జన – సాంగత్యమ్మున – సంతోసమొందుట యెన్నటికో ॥ యేసును ॥
5.
నీతి రహిత పైశాచిక భటగణ – నిందలు బాయుట యెన్నటికో – ఖ్యాతిగ
శ్రీ పర – మాత్ముని కొలువున – గట్టిగా గుదురుట యెన్నటికో ॥ యేసును ॥
6.
రేయు వ్యాధి సంశోక మరణములు – జొరని చోటుండుట యెన్నటికో – పరిశు
ద్ధతయును – బరమానందము