FaithWalk
← Back to Library

#490క్రీస్తునందు ఆనందించుట

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
మా యేసు క్రీస్తుని – మరుగ Off గలిగెనురా – నా యాత్మ ఘనరక్షా – నగమున కెక్కెనురా ॥ మా యేసు ॥
1.
ముందు నాలో పాప – ములు చూడబడెరా డెంద ము తా నన్ని – టిని నొప్పుకొనెరా – యందుకై బలు దుఃఖ మాత్మ జెందె నురా – సందేహములు వీడు – జాడ గన్గొనెరా ॥ మా యేసు ॥
2.
సువిశేష బోధనా – చెవు లాలించెనురా – అవివేక శాస్త్రోక్తు – లంటు వీడెనురా – నవవస్త్ర క్రైస్తవ గోష్ఠి – భువి నా కబ్బెనురా – వివిధము లగు వేల్పు – ల విష్ట మెరి గెగదా ॥ మా యేసు ॥
3.
బాధ గురువుల మోము – ల బహు లజ్జ పడెరా – గాధ మంత్రములన్ని – కడగండ్లై చెడెరా – శోధించి నా యాత్మ – శుద్ధి గోరెనురా – సాధించి ప్రభు క్రీస్తు – శరణు జొచ్చెనురా ॥ మా యేసు ॥
4.
మతిలోని లోతుమ – ర్మము గానబడెరా – మితిలేని ఘన పాప – మే నిండి కొనెరా – హితముగా తన జీవ – మిచ్చె క్రీస్తుండురా – మృతిచేత మన పాప – వితతి గొట్టెనురా ॥ మా యేసు ॥
5.
కులగోత్రముల బుద్ధి – కుటిలంబు దెగెరా – బలవత్పిశాచ శృంఖలము విరిగెనురా – సిలువ మోసిన వాని – చిర సౌఖ్యోన్నతిరా – నెలవుగా నాలోన – నిలచి యున్నదిరా ॥ మా యేసు ॥
6.
తన పోల్కె నొరులగ – నొంగ బ్రేమయైననురా – మనసు దేవునికి న – ర్పణ సేయబడెరా – ఘన కృపా శాంతులు – గొనె ను నెమ్మదిరా – మనసు మార్పాడి మోక్ష – మహిమ గనుగొనెరా ॥ మా యేసు ॥