FaithWalk
← Back to Library

#488క్రీస్తునందు ఆనందించుట

Author: యేసుదాసు నరసయ్యComposer/Ragam: బిలహరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఘనమైన క్రీస్తు కృపను – గనుగొంటి నిప్పుడు – ఘనుడు తన మహిమచే – గాంచి పెంచెను నన్ను ॥ ఘనమైన ॥
1.
ఆపదలలో మునిగి – యేడ్చుచుండగ నన్ను – జేపట్టెను చింత – చే జెడకు మనుచు – వేపాకు కన్న నిది – వెగటైన నా జిహ్వ – తీపుగా నొనరించి – స్థిరపరచె నిప్పుడు ॥ ఘనమైన ॥
2.
ఘనమైన యాపదల – కడలిలో బడియున్న – ఘనుడు నా దెస జూసి – మనసు నొచ్చుకొనియె – కనికరముచే నిన్ను గరుణింతు నిప్పుడే – వెనుక జూడక తనదు – వెంట రమ్మనెను ॥ ఘనమైన ॥
3.
కుల గోత్రములు వీడి – కుటిలంబు దిగనాడి – వలబడ్డ చేపవలె – వదలక పిలి చెన్ – సిలువపై నసువువిచ్చి – బలహీన మెడలించి – వలవలను కన్నీరు – వలబోసినాడు ॥ ఘనమైన ॥
4.
పర్వతములపై గట్టు – పట్టణమువలె నిన్ను – నిలలోన నుంచితి – నుచితంబుగాను – సర్వజనులకు వెలుగు సాక్షిగా నీవుండు – గర్వింప వదనుచు ॥ ఘనమైన ॥
5.
సద్గుణ లంబగు జ్ఞాన – సరణి యిదె నా మాట – ముదముతో నమ్మినను – మోక్ష మోసగెదను – ఇక సి సాతాను బలు – కాడిక్రిందను బడిన – విదలించి నరకమున – వేతునని పలికెన్ ॥ ఘనమైన ॥