FaithWalk
← Back to Library

#485భక్తుని వృద్ధాప్యము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: సావేరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
సకలేంద్రియము లారా – చాల మీ పని తీరె – నిక నన్ను విడిచి పోవుటకు వేళ యైనది ॥ చకిత మృగ శాబకము పోలిక – నకట మీచే జిక్కితిని ॥ శ్రవణేంద్రియము నీదు – శక్తి తగ్గుచు వచ్చె – వివిధ వార్తలు దగిలి – వినుచుంటి వెంతొ – చెవుడు నీ కిప్పుడనుసరించెను – చేవ తరిగెను జరిగి పొమ్మింక – సవినయంబుగా యేసు క్రీస్తుని – శబ్ద మాలించెదను సుఖ మది ॥ సకలేంద్రియము ॥
1.
కనులారా మీ వెలుగు – క్రమముగా క్షీణించె – మునుపు చూచు చూడ్కిలో – ముసుకయ్యె నికను – ఘనముగల దేవుని కు మారుడు – తన కృపాసనమిప్పుడు చూపును – మనసు లోపలి కన్ను విప్పెడి – దినము లీ వెంచెద జూడుడి ॥ సకలేంద్రియము ॥
2.
రసనేంద్రియము నీ – రస కాలమిదె వచ్చె – విసుకని మాటలను వెదజల్లినావు – పసిడి దిరిగి ముదివైతివిపుడు – రసన నీ యింక తీరె నీ పని – వ్యసనమున నే నిప్పుడేసు కరుణా – రసము గ్రోలుచు బ్రొద్దు బుచ్చెద ॥ సకలేంద్రియము ॥
3.
తనదు వాద్యంతము మూయ – దగిన త్వగింద్రియమా – నిన్ను తాకునట్టి వ – న్నియు గ్రహించితివి – మునుపుగల నీ బిగువును నణంగెను – వ్రేలాడె దిక్కులు – చనుము నీ వెందైన నేనే – సుని స్వరూపము దాల్ప బోయెద ॥ సకలేంద్రియము ॥
4.
ఘ్రాణేంద్రియమ నీవు – కడు వాసనల దగిలి – ప్రాణానిలము చేత – బ్రతికితి వికను – నాత్యమైనవి విడువును దూర మార్గముల డేలబోదు విక నా – ప్రాణపతి యగు క్రీస్తుచేతను – బ్రాణమర్పింతును సుఖింతును ॥ సకలేంద్రియము ॥
5.
కడు దవ్వు పయనము – నడచి వచ్చితి నింక – నిడుపు లేదుగా త్రోవ – నికటమై వచ్చెన్ – నడుమ నడుమ నడుడ్డుపడియెడ – నిడుమ లన్నియు గడచి పోయెను – జడుతు నా మృతి నదికి నా నా – వికుడొచ్చెను నన్ను గావను ॥ సకలేంద్రియము ॥
6.
వెనుక దిరిగిన మార్గ – మున కంటె ముందుండి – కన్పించు నా త్రోవ – కఠినమై యుండు – ఘన తరంగ ధ్వనితో భీ – కర మరణ నది పారుచు న్నది – క్షణము మాత్రమే దాని పని యా – వెనుక నావలి యొడ్డు జేరెద ॥ సకలేంద్రియము ॥
7.
ఈ సంసారమునందు – నేమి సౌఖ్యము గలదు – ఆశ మాత్రమే గాని – యది చిరము గాదు – యేసు క్రీస్తుండు తండ్రి దేవుండు – భాసురంబగు నిర్మలాత్మయు – దాసులకు దమ దివ్యమగు కృప – చేసి నిత్య నివాసమిత్తురు ॥ సకలేంద్రియము ॥