#484లోక విసర్జనము
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: బిలహరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
పోపోవే యో లోకమా – చాలింక జాలు – నీ పొందు మే మెందు
లవము – పాపేచ్ఛలున్నంత – సేపు నొప్పగ రా ని – వేపాట్లు బెట్టితివి – వీపట్ల నన్ను వీడి ॥ పోపోవే ॥
1.
సకలేంద్రియ వ్యాప్తులు – నీ సేవ బా – యక చేయు దివసంబులు – ఇంక నిర
పోయె భ్రా – మికము చూపకు మిప్పుడు – ప్రకటముగా క్రీస్తు – పద భక్తి మా
కబ్బెన్ ॥ పోపోవే ॥
2.
నీ రాజు బహుమానము – గంటిమి ఘోర – నరకాంబుధి తీరము – దారి దొలగి నిన్ను
– జేరి దుఃఖముల వే – సారి తిప్పడు క్రీస్తు – సదయుడై నన్ను బిలిచెన్ ॥ పోపోవే ॥
3.
ఎర జూపి బలు మీనము – బట్టెడు వాని – కరణి వస్తుల రూపము – బొరి జూపి
లోభము – బుట్టించి నన్ను బట్టి – పరిమార్చితివి యింక – మరి యేమున్నది చాలున్ ॥ పోపోవే ॥
4.
ఎండమావుల తేటలు – నీ విచ్చెడు – దండిన ఐహ సుఖములు – కండ
గర్వముచే నీ – యండ జేరితిగాని – నిండు నెమ్మది దయా – నిధి క్రీస్తు నిప్పుడిచ్చున్ ॥ పోపోవే ॥