#483జీవిత యాత్ర
Author: గొల్లపల్లి నతానియేలుComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
పరదేశుల మో ప్రియులారా
మన పుర మిదిగా దెప్పుడు – నిజముగా ॥ పరదేశుల ॥
1.
చిత్ర వస్తువులు – చెల్లెడి యెకవి – చిత్రమైన
సరిత – లోకము ॥ పరదేశుల ॥
2.
సంత గొల్లు క్షమ – సడలిన చందము – బంతయు
సద్దణగున్ – నిజముగా ॥ పరదేశుల ॥
3.
స్థిర మని నమ్మకు – ధర యెవతೀರಿకిని –
పరలోకమె స్థిరము – నిజముగా ॥ పరదేశుల ॥
4.
మేడలు మిద్దెలు – మేలగు సరుకులు – పాడై కనబడవే – నిజముగా ॥ పరదేశుల ॥
5.
ధర ధాన్యంబులు – ధర తగ్గక మానవు – పని
పాటలు పోయె – నిజముగా ॥ పరదేశుల ॥
6.
ఎన్ని నాళ్లు మన – మిలలో బ్రతికిన – మనలై
పోవునుగా – దేహము ॥ పరదేశుల ॥
7.
వచ్చితి మిచ్చటికి – వట్టి హస్తములతో – తెచ్చిన దేది
యు లే – దుగదా ॥ పరదేశుల ॥
8.
ఎట్లు వచ్చితిమి – ఈ లోకమునకు – అట్లు వెళ్ల
వలయున్ – మింటికి ॥ పరదేశుల ॥
9.
యేసునందు వి – శ్వాసంబుంచిన – వాసిగ
నిను జేర్చున్ – పరమున ॥ పరదేశుల ॥
10.
యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా – నిజముగా ॥ పరదేశుల ॥