#482క్రైస్తవ యాత్ర
Author: విలియం డాసన్Composer/Ragam: బిలహరిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
పదరే సోదరులారా – పరమపురి జేర –
మధుర జీవాధార – పదవి చేకూర – తుది మొదలును ఆపద – రేబగ
లు లేని – సదనంబునకు జేర – సదయుడేసుని గూడి ॥ పదరే ॥
1.
ఎన్ని దినములు బ్రతికిన – నేమి సౌఖ్యంబు – అన్ని
విధముల జూడ – నధిక కష్టంబు – కన్ను మూసిన నాడు – మన్ను పాలౌదుము –
మున్లు జాగ్రత్త నొంద – కున్న నష్టము కలుగు ॥ పదరే ॥
2.
ధరణి బ్రతుకును గోర – మరణ భయంబు –
దరిలేని చింతల – దగిలె నిత్యంబు – పరి పరి విధముల – పరుగు లెత్తుట యేల –
నిరతంబును సువార్త – సరణి గన్గొని వడిగా ॥ పదరే ॥
3.
ధనము సంపాదించి – ఘన మది కమున్న – తను
వె సతము గాదు – అనుభవము సున్న – ఇను డెంద మావముల – ను గోర
నేపాటి – తనివి తీరునిచ్చోట – ను నా పాటే తీరున్ ॥ పదరే ॥
4.
పరలోక మార్గము – బిరుకై గనప్పడును జొరగా
సంకటములు – నెరజుట్టుకొనును – పరమ జనకుని కృపా – వరము తోడుగ
నున్న – వెరపు నొందక వింక – సరకు సేయుము పద ॥ పదరే ॥
5.
ఇహ క్షేమములు మన – కింక జాలు జాలు – బహు
దినంబులు సేయ – బడ నేమి మేలు – మహిమ దూతల స్నేహ – మమరు నచ్చట –
మనకు నహహా యేసుని జూడ – నధిక సంతోషంబు ॥ పదరే ॥
6.
మనల తోడ్కొని పోవ – ఘనుడు యెహోవా –
యనంబు తన శుద్ధా – త్మను నిచ్చి కావ – నేన లేని యడ్డంకు – లన దాటిం
పను గృప – గనుపరిచి
తోడుగ – నునికిచే వేగము గూడి ॥ పదరే ॥
7.
భక్తులై యున్నట్టి – బంధు మిత్రుల – రక్తి
గుణముతో – రంజిల్ల గనినన్ – ముక్తి రాజ్యంబుల – మురువుతోడ సర్వ – శ
క్తుని మహిమ నా – శక్తితోడను చూతుము ॥ పదరే ॥