FaithWalk
← Back to Library

#486భక్తుని జీవిత ప్రయాణము

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: యదుకులకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
పయనమై యుంటినయ్యా నీ – పాదాంబుజముల సన్నిధికి ప్రభు యేసు నాతో నుండవే నీవు – దీనుడ భవదా – ధీనుడ నన్ను గృప – తో నడిపించు మె – దుట నదె సింహ – ధ్వనముతో మృతి వచ్చుచున్నది – దాని భీత్యోత్పా – తము దొలగింపవే ॥ పయనమై ॥
1.
శరణిలో నే బోవునప్పుడు – శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా – పరు గు కడ్డముగా నిలుచునేమో – మరణపు ముండ్లను – విరుచుటకును – దురవస్థలు వెసన్ – దొలగించుటకును – గరుడానిధి నా – సరస నుండు మి – శరణాగతునకు – మరి దిక్కెవ్వరు ॥ పయనమై ॥
2.
దేవా నీ దక్షిణ హస్తముతో – దీనులను బట్టెదవ వెరవకండ – నీ వాగార్థమున కిది సమయంబు – ఆ వచనము నా – జీవాధారము – దైవము తల్లియున్ దండ్రియు దాతవు – నీవే సర్వము – నిన్ను నమ్మితి నా – త్రోవ ప్రయాణము – తుద ముట్టించుము ॥ పయనమై ॥
3.
పొందుగా నీ భక్తియందు – డెంద మానందించునప్పుడు – సందియము లే నెన్నెన్నో చనుదెంచి – తొందర పెట్టకుండ నా – త్రోవను తద్వారా – ధాంధత లేకుండా ॥ పయనమై ॥
4.
కాలం బైయ్యెను రారమ్మనుచు – నీల మేఘాకృతితో వచ్చి – కాలదండము గిరగిర ద్రిప్పుచు – చాల భయానక లీలన్ మృత్యువు – మ్రోల నిలిచిన – వేళను దాలిమి – దూలి చనంగ – బోలు భవత్కరు – ణాలింగన సుఖ – మత్తరి నొసగవే ॥ పయనమై ॥
5.
నీ దివ్య రూప ధ్యానంబు – నిర్మలాత్మాంతర సౌఖ్యంబు – నా దేవుని ప్రేమామృత సారంబు – నీ దాసుని కవి – నిరత మొసంగుచు – నా దారిని గల – సేదలు దీర్పను – నాదియు మధ్యము – నంతము లేని పు – నాదులుగల నీ – సౌధము జేర్పవే ॥ పయనమై ॥
6.
ఎండమావుల కీడైనట్టి – యిహ సౌఖ్యములు త్వరగా బోవు నీ – నిండు దరుగని నిత్యానందంబు – దండిగ నీయం దుండినవారి క – ఖండామృత సౌ – ఖ్యము లిచ్చెదవట – తండ్రి భవదు – త్తమ దాసుల నీ – వుండిన చోటనే – యుంచుము చాలును ॥ పయనమై ॥