#480లోకము క్రీస్తుకు సాటిరాదు
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: మారువCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
లోకము వారెల్లా – లోకువన యెంచిన – లోపము నీకేమిటి – ప్రాకట
ముగా గ్రీస్తు – పతిత పావన మూర్తి – నీకోసమై ముక్తి – నిలయము గట్టంగ ॥ లోకము ॥
1.
దరిలేని దురిత దుస్తర పారావారము – దాటించు వారెవరు –
భీకరమైన – నరకాగ్ని బెట్టు బంధుర దైవ
కోపాగ్ని – మరలించు వారెవరు – చంచల బుద్ధి స్థిరపరచి పరమార్థ
– మెరిగించి చిరముక్తి – గురి దెల్పు వారెవరు – ఈ ధరణిలోన నర
రూపము దాల్చి నీ – కొరకై జీవనమిచ్చు – కరుణాబ్ధి క్రీస్తుండు –
వరదుడై యుండంగ ॥ లోకము ॥
2.
మాటి మాటికి పాప – మార్గమున జనుచుండ – మది త్రిప్పు వారెవరు
– సైతానుని తాటించి మరి వాని కైటించి యభయహస్తము నిచ్చు
వారెవరు – మృత్యువు ముల్లు మీటించి సుఖమాత్మ
– నాటించి తన యోర్మి – చాటించు వారెవరు – యెరూషలేము బయట గల్వరి మెట్ల – పై మేను
బలియిడిన – మేటి క్రీస్తుని నామ – మమృతము నీకుండగ ॥ లోకము ॥
3.
హృదయ సంతాప దుఃఖ దురంతమగు చింత – లతికించు వారెవరు –
నెమ్మది నిచ్చి – పదిలమ్ముతో మోక్ష – పదవి యిడుగో యెంచు – పదవును
వారెవరు – ఎన్నడు నిన్ను వదలి వేయ
మంచు – మృదు వాక్యములు తెలిపి – ముదమిచ్చు వారెవరు ఇంకొక్క
నాడు సదయుడై క్రీస్తుడు – చనుదెంచి నిను ముక్తి – సదనమున స్థిరముగా జేయు శాస్త్రోక్త మిటలుండ ॥ లోకము ॥