#479క్రైస్తవ యాత్రికుడు
Author: జె. ఇ. శార్క్Composer/Ragam: తోడిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఇందు లేదు నిలుచు పట్టణము – క్రీస్తు యాత్రికులకు – నిందు లేదు నిలుచు పట్టణము ॥ ఇందు ॥
1.
పాడుకొన్న లౌకికమునకు – బహుళ దుఃఖమిది మరి సొం – పైదగు మేలు
చోటు వెదకు – భక్తుడు వెత నొంద నెప్పుడు ॥ ఇందు ॥
2.
మాకు నిల్వదైన దుఃఖ – మౌకదా వచ్చు పురము – దాకొనంగ వెదకెదము –
ధైర్యమిచ్చు నిదియే మాకు ॥ ఇందు ॥
3.
మనము యాత్రవారి వలెనే – ఘనత విశ్రమంబులేక – కనుక నీ లోకమునను
– కృంగి వన్ని వదలుదాము ॥ ఇందు ॥
4.
మిగుల యాత్రపరుల విశ్ర – మించు సౌఖ్య వాసమా – ఖగము వలెనే టెక్కలున్న –
నెగిరి నిన్ను జేరుకొందు ॥ ఇందు ॥
5.
సద్దు నా యాత్మ నణంగ – వద్దు తగిన వేళగావి – యొద్ది కతని తలంపు
జేతు నొసగు విశ్రమంబ తండ్రి ॥ ఇందు ॥