FaithWalk
← Back to Library

#478విజ్ఞానికి విసుగు

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శుద్ధకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
విసుకదె ప్రాణంబు – విజ్ఞానికిలను – పొసగు వైరాగ్యంబు – పుట్టదే – తలను – అసదుగానట్టిక – క్షానుభవమేగాని – యసదృశానంద ఫల – మొసగునది యేది ॥ విసుకదె ॥
1.
మును పేది యుండెనో – వెనుక నదియును యుండు – మునుపు వెనుకకు మధ్య – మున నున్న దదియే – నొనరంగ గ్రోత్తయై – యుత్పన్నమగునట్టి – ఘనకార్య మొక్కటియును – గానంగరాదు ॥ విసుకదె ॥
2.
ధరణి మీదికి దిగం – బరుడగుచు నేతెంచు – మరణమప్పుడు దిగం – బరుడగుచును బోవున్ – నరుడు పుట్టిననాడు – సరెకేదియును దేడు – మరణమగునాడు ఒక – సరకు గొనిపోడు ॥ విసుకదె ॥
3.
ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచెన్ – సకల వంశము లీట్లు – సమసిపోవుచుండ – నిక వారి పేరెరుపు – లేచోట నేమాయె – నొక్కండైనా జెప్పుటకు నిలలో లేడు ॥ విసుకదె ॥
4.
ఏటి వంకలు తీర్చ – నెవానికి గల విము – న్నిటి మూకుడు చేయ – నేర్పరి యెవండు – మోటైన మనసు వం – పులు తీర్చు గురు వెవ్వడు కోటి ధన మిచ్చినను – కుంభినిని లేడు ॥ విసుకదె ॥
5.
ధరణిలో నరరూప – దాల్చి పాపుల కొరకై – మరణమై లేచు స – ద్గురుడైన యేసు – చరణాబ్జముల సేవ – సారమిది యొక్కటే – పరమ ఫలమిడు సుఖ – ప్రాప్తి యొనరించున్ ॥ విసుకదె ॥