FaithWalk
← Back to Library

#477ఇహ లోకము విశ్రాంతి లేనిది

Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: శుద్ధకాంభోజిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఏది నా విశ్రాంతి – ఈ లోకమందు – నే దిక్కు గనుగొన్న – లేదు సుఖ మొందు – మేదుర మోద ని – త్యోద్యదగ్ర మోక్ష పుట – భేదమున కొరకున్న – లేదు సుఖ మెచ్చట ॥ ఏది ॥
1.
కష్టములు తెరతెరలు – గా వచ్చిన మదాత్మ – దృష్టి దప్పక యోర్చి – తీరమందుండ వలయున్ – స్పష్టమగు నా త్రోవ – పయనంబు తుద ముట్ట – శ్రేష్ఠమగు నా యిల్లు జేరు నందాక ॥ ఏది ॥
2.
కోరింద పొదచుట్టు – కొనియుండ నిమ్ము నే – గోర నిచ్చట గులాబి – కుసుమ శయ నంబు – నే రీతినైనా నా – యేసు రొమ్మున జేరి – భూరి సుఖమొందెద వి – చార మింక నేల ॥ ఏది ॥
3.
యేసుప్రియ మించు కే – నెరిగి కన్గొను వేళ – నా సంతోసము నిండు – పాసి చనె నెల్ల చీకటులు – భాసురంబుగా మంచు – పగిలి దళ తళలాడ – జేసె నా కన్నీళ్లు – చింతలెడబాపి ॥ ఏది ॥
4.
ఉండు నే సందియము – లుండు నే దుఃఖములు – గండములు డయ్యునుచు బైకి రా గలవే – మెండుగా మధురమై – యుండు మోక్షము నాకు – తండ్రితో గడియసే – పుండనిచ్చిన జాలు ॥ ఏది ॥
5.
నడుము పై నొక సంచి – బడెకరు కరము చేతిలో – నిడికొనుచు శత్రువుల – పుడమి వే గడుతుకన్ – నడుదారి కరుకు నె – నన్నక వేగ రక్షింప – భద్రుడనని పాడి చని – పరమ సుఖి నౌదు ॥ ఏది ॥