#476యేసు భాగ్యదాత
Author: పులిపాక జగన్నాథముComposer/Ragam: రేగుప్తిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసుని సేవింప దయచేసితివి –
ప్రేమస్వరూప – యేసుని – దాసులనందరిని దరి జేర్చుటకును – వాసికెక్కిన
పరవాసము చేసెడి ॥ యేసుని ॥
1.
ఆదియందు భూమ్యాకాశంబుల – శక్తి యాత్మ నింపార సృజించిన ॥ యేసుని ॥
2.
శత్రువులగు జనసంఖ్యను బొడగని – మిత్రుడుగుచు ధనమేను నొసంగిన ॥ యేసుని ॥
3.
పాపులెల్ల ధనప్రాపుగోరుకొని – దాపుగరండని దయచేసి బిలిచెడి ॥ యేసుని ॥
4.
సకల శుభంబులు చక్కగా నిచ్చుచు సకల భక్తులను సమముగా నేలెడి ॥ యేసుని ॥
5.
తనను నమ్ముకొని యున్న దీనులకు – దననుగా ప్రబలుడై యుండని సన్నుతుడగు మా ॥ యేసుని ॥
6.
చక్కని గుణములు లెక్కలేక తన – చక్కని యాత్మను చిక్కగా బట్టిన ॥ యేసుని ॥
7.
లోకమంతయును లోబడుచుండగా – నేక ప్రభువై యేలుచుండుమా ॥ యేసుని ॥