FaithWalk
← Back to Library

#48ఉదయస్తుతి

Author: బన్యన్ జోసెఫ్Composer/Ragam: ఆనందభైరవి (ఛాయ: ఎందుకు మరచితివి)Category: దైవారాధన — దైవస్తుతి
ప
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనే స్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్ము రక్షించి గాపాడి ధాత్రి మరియొక్క దినమును దయతో నిచ్చిన దేవా ॥స్తోత్రము॥
1.
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్య ఏ పాపము మమ్మును ఏల నియమింపకుండ మాపు రేపులు మమ్ము మన్నించి బ్రోవుమయ్య ॥స్తోత్రము॥
2.
కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవా అన్నదమ్ములవలె మేము అందరిని ప్రేమించి మన్ననతో నీ దినము మన నియ్యుము ఓ దేవా ॥స్తోత్రము॥
3.
పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యా నీతిమార్గములందు నిరతము మము గాచి ఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్ము ఓ దేవా ॥స్తోత్రము॥