FaithWalk
← Back to Library

#49సాయంతన సమర్పణము

Author: మిక్కిలి సమూయేలుComposer/Ragam: నాదనామక్రియCategory: సాయంతనారాధన
ప
వినవే నా వినతి నివేదన దయ వెలయగా నో ప్రభువా నిను శరణొందితి నన్ను గుశలంబున నునుపవె యో ప్రభువా ॥వినవే॥
1.
నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువా ధర్మదీప్తి నా కొసగి చేయు దీపవంతునిగ నన్ను ॥వినవే॥
2.
నీ మహదాశ్రయ మొసగి దుర్గతిని బడకుండగను నా మది తదభివృద్ది సమస్తముతో నన్ను గావగ ప్రభువా ॥వినవే॥
3.
ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవారా పన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేపగలు ॥వినవే॥
4.
పాపకరుండను నేను సుకృతా పాది కర్మ మెరుగ నీ పాద సరోజము నా కొసగుము నా పై నీ కృప జల్లగా ॥వినవే॥
5.
నీ కొరకై నా మనము దృఢంబుగాక యేసు ప్రభువా నాకు పిశాచముచే భ్రమ జన్మము గాకుండగ నేలు ॥వినవే॥