FaithWalk
← Back to Library

#47ప్రాతఃస్తవము

Author: UnknownComposer/Ragam: పంతువరాళి (ఆదర్శం: ఇదిగో గొర్రెల కాపరి)Category: దైవారాధన — దైవస్తుతి
ప
లేచి స్తుతింప బూనుకొండి లోకేశ్వరుని లేచి స్తుతింప బూనుకొండి లేచి స్తుతించెదము చూచుచు మనలను బ్రోచి ప్రేమతో కరము జాచి కాపాడు విభుని ॥లేచి॥
1.
రాత్రి జాముల యందున రంజిల్ల దన నేత్రము తెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమి శ్రోత్రముల కింపు సత్ప్రవిత్ర గీతము పాడుచు ॥లేచి॥
2.
నిదురబోయిన వేళను నిర్మలమైన హృదయము మనకు నియ్యను ముదముతో నిదుర బొంది యుదయాన లేచితిమి సదయుడైన క్రీస్తు పదముల దరిజేర ॥లేచి॥
3.
నేటి పాఠములయందున నిర్భయముగా దావివలె నిలిచి యుందు సూటిగ నీదు రెక్కల చాటుగాను నిలుపు మనుచు నీటుగా దెల్లవార నిత్యము ప్రేమనేల ॥లేచి॥