FaithWalk
← Back to Library

#474యేసు కొరకే జీవింతును

Author: రావి జాన్ సుందరరావుComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
యేసుని కొరకై యిల జీవించెద – భాసురముగా నే ననుదినము – దోసములన్నియు బాపెను మోక్ష – నివాసమున ప్రభు జేర్చునుగా ॥ యేసుని ॥
1.
నాశనకరమగు గుంటలోనుండియు – మోసకరంబగు బురదనుండి – నా సచే నిలబెట్టెను నన్ను పి – శాత పదమును దొలగించెను ॥ యేసుని ॥
2.
పలువిధముల పాపంబును జేసితి – వద్దని ద్రోసితి వాక్యమును – కల్మషము బాపెను కరుణను బిలిచెను – సిలువలో నన్నాలకించెను ॥ యేసుని ॥
3.
అలయక సొలయక సాగిపోదును – వెలయగా నా ప్రభు మార్గములన్ – కలిగె ను నెమ్మది కల్వరిగిరిలో – విలువగు రక్తము చిందించిన ప్రభు ॥ యేసుని ॥
4.
శోధనలు బాధలు శ్రమలిల కలిగిన – నాదుకొనును నా ప్రభు వనిశం – వ్యాధులు లేములు మరణము వచ్చిన – నాధుడె నా నిరీక్షణ యగున్ ॥ యేసుని ॥
5.
బుద్ధివిజ్ఞాన సర్వ సంపదలు – గుప్తమైయున్నవి – ప్రభునందు – అద్భుతముగా ప్రభు – వన్నియు నొసగి – దిద్దును నా బ్రతుకంతటిని ॥ యేసుని ॥
6.
అర్పించెను ధన ప్రాణము నాకై – రక్షించెను నా ప్రియ ప్రభువు – ఆర్పింతును నా యావజ్జీవము – రక్షకుడేసుని సేవింప ॥ యేసుని ॥
7.
ప్రభునందా నందింతును నిరతము – ప్రార్థన విజ్ఞాపనములతో – విభుడె తీర్చునిల నా చింతలు – అభయ ముతో స్తుతియింతు ప్రభున్ ॥ యేసుని ॥
8.
యౌవన జనమా – ఇదియే సమయము యేసుని చాటను రారండి – పావన నామము – పరి శుద్ధ నామము – జీవపు మార్గము – ప్రచురింపన్ ॥ యేసుని ॥