#473సుబోధ
Author: పురుషోత్తము చౌదరిComposer/Ragam: మోహనCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
వద్దు మనస – బుద్ధి కురుచ – పెద్దలకు బెద్ద పరి – శుద్ధుడగు క్రీస్తు తా – దిద్దు నిన్ను బ్రేమ సరి – హద్దులను మీరబో ॥ వద్దు ॥
1.
చెడ్డ తలంపు – లడ్డి నిలుపు – మెడెలకు నెడెయగు – గడ్డు సాతానునకు –
మెడుకొని దొడ్డ ప్రభు – బిడ్డవలె నడువు మింక ॥ వద్దు ॥
2.
నింద పాలు – బొంద మేలు – పొందుగను అందముగా – ముందు నీ
యందు వెలు – గొందు ప్రభు సుందరుని – బంధనలు మరిచి పో ॥ వద్దు ॥
3.
ఆశ బెట్టు – యేసు తట్టు – దోసములు వాసి చన – జేసి నన్ను మో
సగి కొన – యేసు నిజ దాసులను – బాసి యుండకు మింక ॥ వద్దు ॥
4.
బెండు పడకు – నిండు విడకు దండి గల తండ్రి యొడ – యుండు యేసుండు నీ – యండ
నుండగ నీ – గుండె దిగులేల యింక ॥ వద్దు ॥
5.
పట్టు విడకు – దిటము సెడకు – నెట్రుకొని ముట్టడి గన – జుట్టుకొను
కష్టముల – బిట్టు విడగొట్టు ప్రభు – తట్టు కనిపెట్టు మింక ॥ వద్దు ॥
6.
మంచి గుణము – లెంచి కొనుము – వంచనల మించి గ – ర్వించి నీ దు
ర్భావమును – ద్రుంచు ప్రభు నొద్ద గురి – యుంచి ప్రార్థించు మింక ॥ వద్దు ॥