FaithWalk
← Back to Library

#472ధన్యతలు

Author: విలియం డాసన్Composer/Ragam: భైరవిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
వారు భాగ్యవంతులౌదురు – భూలోకమందు – వారు భాగ్యవంతులౌదురు – చారు శుభవార్తా రవంబు – గోరి యాకర్ణించి భక్తి – మీర దెలిసికొనిన యట్టి – ధీరు లెవ్వ రెవ్వరో ॥ వారు ॥
1.
వారు నడుచు మార్గమందున – సుఖ క్షేమ రాజి – వారి ననుసరించు నెందును – తేరి చూడరాని దే – దీప్యమాన దివ్య సత్య – భూరి తేజ మాజనులను – బొలుపు మీర జుట్టుకొనును ॥ వారు ॥
2.
విమోచకుని నామమందున – ద్విజనంబుల – విశ్రుతానందంబు ప్రాణముల – యమందముగా హెచ్చరింప – నతని నీతి సృతి – జముల కోరకై వృద్ధి బొం – దంగ జేయు సంతతంబు ॥ వారు ॥
3.
నరుల భై పిశాచమును – నిందా స్థాప – నంబు చేయంగలేదు – పరగు – ప్రకాశమును – బ్రాపునైన సర్వ – శ్వరుడు బలము రక్షయున – వారితముగా మనకిచ్చు ॥ వారు ॥
4.
వరగుణ ప్రశస్తులారా – క్రైస్తవులారా – వెన్నెమీర మీ రాజు సురుచిరముగా శాశ్వతముగా – పరిపాలించుగాక దేవుడు – నిరతముగను జీవించు – నీతి భరిత చిత్తుడగుచు ॥ వారు ॥