FaithWalk
← Back to Library

#471ఒట్టి చేతులతో వెళ్ల తగునా?

Author: UnknownComposer/Ragam: ఇంగ్లీష్ మూలం: Must I go and empty handedCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఒడుచు చేరి నీ యెదుట నిల్పునప్పుడు రక్షకా ఒక్క యాత్మనైన తేక సిగ్గుపడిపోదునా ॥
1.
ఒక్క యాత్మనైన నేను రక్షింపక యేసువా వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా ॥
2.
ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలమును వ్యర్థపరచు వారానాడు చింతతోడ నిలుతురు ॥
3.
యేసువా! నా స్వరక్షణ నిశ్చయంబు యైనదే ఐన ఫలితంబు చూడ కష్టపడనైతినే ॥
4.
కాలమెల్ల గడచిపోయెన్ మోసపోతినేనయ్యో గడచినట్టి కాలమైతే ఏడ్చినను రాదిక ॥
5.
భక్తులారా! ధైర్యంతోడ లేచి ప్రకాశించుడి ఆత్మలెల్ల యేసు యొద్ద జేరునట్లు చేయుడి ॥