#468నశించు వారిని రక్షింపుడి
Author: ఫ్రాన్సెస్ జేన్ వాన్ అల్ స్టైన్ (అనువాదం: జేకబ్ చేంబర్లేన్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Rescue the perishing, care for the dyingTranslator: జేకబ్ చేంబర్లేన్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
పాపము వలన జెడిన వానిని
ప్రేమతో వెతికి రక్షించుడి
తప్పినవానిని ద్రోహిని మీరు
యేసుని యొద్దకు రమ్మనుడి ॥
1.
పడినవారికి జూపుడి త్రోవ
యేసు పాపాత్ములను రక్షించును ॥
2.
నీతిని కొరకు నల్లాడు వానిని
యేసు రక్షించుటకై కాచును
ప్రేమతో వారిని బిలుచుకొండి యేసును నమ్మిన రక్షించును ॥
3.
పాప విషయము మనసున దాగి
గుణము పూర్తిగా జెరిపినన్
యేసుని ప్రేమ యను కిరణంబు దాని గుదుర్చును సంపూర్ణముగా ॥
4.
జెడినవారిని రక్షింప బొండి
యేసుడు శక్తిని మీకీయుగా
మోక్ష మార్గంబున నడిపించుచుండుడి
వారిని రక్షింప యేసు వచ్చెన్ ॥