#467ఉదయమున విత్తనము నాటుము
Author: కె. షా (అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Composer/Ragam: ఇంగ్లీష్ మూలం: Sowing in the morningTranslator: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
రేపు మాపు గూడ రమ్యమైన విత్తనముల
ప్రీతితోను జల్లి వేసి యుందము
కాపుతోడ నుండి దాపు నుండు పంట
ఏపుమీర పంటను కోసి కొందము ॥
1.
పంట పండగా కోసి కొందము
కంట నీరు పోవ కోసి కొందము ॥
2.
సందేహంబు లేక స్వామి సేవ యందు
వందనంబు తోడ విత్తుచుందము
కొండలంబు లేక కష్ట వృత్తి చేసి యందరంబు చేరి యానందింతము ॥
3.
ప్రేమ విత్తనంబులు క్షేమమయంకురంబులు
ప్రీతిని కాలమెల్ల ప్రాంతమంతటన్
సేవము మొప్ప నాట నాట నీయకుండు రాగనే నిండు పంటను కోసము గూర్చుకొందము ॥