FaithWalk
← Back to Library

#461ఆత్మల సంపాదనము

Author: మల్లెల దావీదుComposer/Ragam: ముఖారిCategory: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం
ప
ఆత్మలను సంపాదింప నగు – ఆత్మ బలమున నిది చేయనగు – ఆత్మ సంపాదనముకన్న – నక్షయానందము లేదనల – యాత్మలను వెదకి రక్షింప నాత్మల కాపరి యా నతిచ్చె ॥ నాత్మలను ॥
1.
ధనముకన్న నాత్మ సంపా – ధనము మేలౌ దాని సంపా – ధనము గోరి మన రక్షకుడు – ధారపోసెను ధన రక్తంబు ॥ ఆత్మలను ॥
2.
క్షణ క్షణము నెందరో నశింప – జాలిలేద నీవు సుఖింప – అణకువతో ననుదిన మొక యాత్మ – నైన రక్షింపగ దయ రాదా ॥ యాత్మలను ॥
3.
పరుల యాత్మ విమోచనంబు – ప్రభువు కోరు బహుమానంబు – పరదుడౌ క్రీస్తును నీవెట్లు – వట్టి చేతులతో దర్శింతు ॥ ఆత్మలను ॥
4.
నీతి మార్గము ననుసరింప – నిత్యమును చక్కగా వర్తింప – పాతకులను ద్రిప్పెడు సద్భక్తుల్ – జ్యోతులట్లు ప్రకాశించెద రింక ॥ ఆత్మలను ॥
5.
జీవనాథంబులు లేవని – సిగ్గు పడకుమి యిది కాదని – ప్రీతితో నాత్మలను గడుప – నీతి మహిమ మకుటంబులౌ ॥ ఆత్మలను ॥
6.
నీ యమూల్య తరుణంబుల – నీ ప్రశస్త దానంబుల – వేరుచేయక నీ సర్వంబు – విభుని సేవకు నీ వర్పించు ॥ ఆత్మలను ॥